ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలను తెలియజేస్తూ సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్రలు నిర్వహిస్తుంది. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలం నవులూరు గ్రామంలో సిపిఎం ప్రజా చైతన్య పాదయాత్రకు గ్రామస్తులు వినతులు అందజేస్తున్నారు. నెల్లూరు జిల్లా మల్లికార్జునపురం గ్రామంలో కాలితిరెడ్డి రమణయ్య స్థూపానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించి పాదయాత్ర దళం ముందుకు సాగుతుంది. పాదయాత్ర 10వ రోజు సంగం మండలం అన్నా రెడ్డిపాలెం గ్రామానికి చేరుకున్నది.











