ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లాలో సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్రలు కొనసాగుతున్నాయి. జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకై సిపిఎం పాదయాత్ర ఐదో రోజు చేరుకుంది. ఈ యాత్ర మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామంలో మొదలైంది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. పాదయాత్రలకు సంఘీభావనిధిగా సిపిఎం పొదలకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం చేసింది.










