ప్రజాశక్తి-నందిగామ : నందిగామ డివిఆర్ కాలనీలో నివసిస్తున్న పేదలకు ఇళ్లపట్టాలిచ్చి ఆదుకోవాలని సిపిఎం నందిగామ పట్టణ కార్యదర్శి డిమాండ్ చేశారు సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో నందిగామ తాసిల్దార్ కు పట్టణ సమస్యలపై పలు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నందిగామ పట్టణ కార్యదర్శి కటారపు గోపాల్ మాట్లాడుతూ పట్టణంలోని 18వ వార్డులో గత 18 సంవత్సరాలుగా నివాసముంటున్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా డివిఆర్ కాలనీ 18వ వార్డులో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని, అనాసాగరంలో డంపింగ్ యార్డ్ ప్రజలు నివసించే గృహాలకు దగ్గరగా షెడ్లు ఏర్పాటు చేస్తున్నారని, అక్కడ చెత్త వేస్తే ప్రజలకు దుర్వాసన వచ్చి ఇబ్బంది పడతారని, అక్కడ చెత్త డంపింగ్ చేయొద్దని అర్జీ స్పందనలో సిపిఎం పార్టీగా ఇవ్వటం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించాలని తాసిల్దార్ నరసింహరావుకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు సయ్యద్ ఖాసిం, కర్రి వెంకటేశ్వరావు, గోపీనాయక్, రవి శేఖర్, కాలనీవాసులు ఉప్పు శీను, బత్తుల వెంకటేశ్వర్లు, పెర్నా గంగాధర్ రావు, పుల్లయ్య, స్వామి రోశయ్య పాల్గొన్నారు.










