Apr 14,2023 14:49
  • దేశాన్ని కాపాడుకుందాం
  • సీపీఐ-సీపీఎం ప్రచారభేరి జయప్రదం చేద్దాం
  • సీపీఐ మండల కార్యదర్శి సలీం భాష 

ప్రజాశక్తి-బి.కొత్తకోట : దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రతీ పౌరుడు గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయాలని,ప్ర జావ్యతిరేక నిరంకుశ మతోన్మాద బీజేపీని ఇంటికి సాగనంపి, దేశాన్ని కాపాడుకుందామని సిపిఐ బి.కొత్తకోట మండల కార్యదర్శి సలీం భాష పిలుపునిచ్చారు. శుక్రవారం కేంద్ర బిజేపి వైఫల్యాలపై వామపక్షాల ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రచారభేరి కార్యక్రమం సందర్భంగా మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అనంతరం ప్రచారభేరి గోడ  పత్రికలు విడుదల చేశారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 30 వరకు సీపీఐ -సీపీఎం ఆధ్వర్యంలో జరిగే ప్రచారభేరి ని జయప్రదం చేయాలని కోరారు.మోడీ -అమిత్ షాల నాయకత్వంలో బిజెపి-ఆర్ఎస్ఎస్ కూటమి అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండవలసిన ప్రజలమద్య మత విద్వేషపు చిచ్చు రాజేస్తోందన్నారు.మరోవైపు ఆదానీ-అంబానీ లాంటి అతి సంపన్నులకు దేశ సంపదను దోచిపెడుతోందన్నారు.బిజెపి నిరంకుశ విధానాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా అణచివేస్తోందన్నారు.దేశంలోని అడవులను భూములను విద్యుత్తు ప్రాజెక్టులను గనులను కార్పొరేట్లకు అక్రమంగా కట్టబెడుతోందన్నారు.కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి,ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నాయన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇంతటి అన్యాయం ద్రోహం చేస్తున్నప్పటికి గట్టిగా నిలదీయలేని దౌర్భాగ్య స్థితిలోకి వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు.ఇటువంటి పరిస్తితుల్లో దేశంలో రాష్ట్రంలో అలుముకుంటున్న చీకట్లనుండి బయటపడటానికి ప్రజానీకమే ఉవ్వెత్తున కదిలి ఉద్యమించాలని, అటువంటి మహోద్యమం నిర్మించడానికి వామపక్ష పార్టీలైన సీపిఐ-సీపీఎం ముందుకొస్తున్నాయని తెలిపారు. జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి మూతపడిన పరిశ్రమలు తెరిపించాలని జిల్లా సమగ్రాభివృద్ధికి పాలకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ బి.కొత్తకోట మండల నాయకులు అష్రఫ్ ఆలీ, తంబయ్యశెట్టి, బాలకృష్ణ, నారాయణ స్వామి, శంకర, గంగులప్ప, గంగాద్రి, సోము రెడ్డప్ప, మోదీన్ తదితరులు పాల్గొన్నారు.