సిపిఎం 23వ అఖిలభారత మహాసభ సందర్భంగా ముద్రించిన సావనీర్‌ను ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ శనివారం ఆవిష్కరించారు. మీడియా హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యురాలు శ్రీమతి టీచర్ కన్నూరు జిల్లా కార్యదర్శి జయరాజన్ తదితరులు పాల్గొన్నారు.
- మహాసభలో పుస్తకాల ఆవిష్కరణ
సిపిఎం మహాసభలో శనివారం వివిధ పుస్తకాలను ఆవిష్కరించారు. కేరళ రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి టిఎం థామస్ ఐజాక్ రాసిన 'అనదర్ పాసిబుల్ వరల్డ్', ' ఎఐకెఎస్ నాయకుడు హన్నన్ మొల్లా రాసిన 'వెన్ ఫార్మర్స్ స్టుడ్ అప్', 'ది 1921 రెబిలియన్ ఇన్ మలబార్' పుస్తకాలను సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆవిష్కరించారు.













