Apr 07,2022 20:49

కన్నూర్‌ : ఇక్కడ జరుగుతున్న 23వ మహాసభల్లో సిపిఎం, కుల వ్యతిరేక పోరాటం పట్ల తన నిబద్ధతను పునరుద్ధరించనుంది. మోడీ సర్కార్‌ మద్దతుతో సంఘపరివార్‌ శక్తులు చాలా దూకుడుగా హిందూత్వ భావజాలానిు వ్యాప్తి చేస్తును నేపథ్యంలో కుల వ్యవస్థను చాలా హేయమైనదిగా, మానవ హక్కులకు, సమాన పౌరసత్వానికి విఘాతం కలిగించేదిగా, దోపిడీ సాధనంగా కమ్యూనిస్టులు తొలినాళ్లలోనే గుర్తించిన తీరును ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వుంది.
''బానిసత్వం, కుల వ్యవస్థ, కులాల్లో అసమానతల (సామాజిక, సాంస్కృతికం ఇలా ఏ రూపంలో వునాు) ను సంపూర్ణంగా నిర్మూలించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం సల్పుతుంది. మన దేశంలోని కార్మిక, శ్రామిక వర్గాలకుసంపూర్ణసమానత్వం సాధించేందుకుపోరాడుతుంది.'' అని1930లో కమ్యూనిస్టు పార్టీ జారీ చేసిన మొదటి సమగ్ర ప్రణాళిక పేర్కొంది.
ఆ ప్రణాళికను ఆమోదించిన తదనంతర దశాబ్దాల కాలంలో, కమ్యూనిస్టు పార్టీ నేతలు అంటరానితనానికి వ్యతిరేకంగా, దళిత వ్యతిరేక ఆచారాలపై, బలవంతంగా విభజించడం వంటి పద్ధతులకువ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. సామాజిక సంస్కరణల కోసం పుచ్చలపల్లి సుందరయ్య, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, ఎకె గోపాలన్‌ వంటి నేతలు బ్రహ్మాండమైన పోరాటాలకునాయకత్వం వహించారు.
మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ తొలినాళ్ల నుంచి మనువాద భావజాలంతో కూడిన హిందూత్వ సిద్ధాంతాల కోసమే పనిచేసింది. కుల వ్యవస్థను చెక్కుచెదరకుండా వుంచేందుకే కృషి చేసింది. డాక్టర్‌ అంబేద్కర్‌, కమ్యూనిస్టులు, కుల వ్యవస్థను నిర్మూలించాలని విశ్వసించి, దానికోసం పోరాడారు. గాంధేయవాదులు సంస్కరణల పట్ల విశ్వాసంతో పోరాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి హిందూత్వవాదులు మాత్రం హిందూ సమాజాన్ని ఒక్క తాటిపై వుంచాలంటే కుల వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. భారత సమాజంలో, ఉత్పత్తి సంబంధాల్లో కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయింది. ఉత్పాదక శక్తులు వ్యవసాయం, ఇతర ఉత్పాదక రంగాల్లో అభివృద్ధి చెందాయి, ఫలితంగా వారికి యాజమాన్య హక్కులు సంప్రాప్తించాయి. ఉత్పత్తి వనరులపై నియంత్రణ లభించింది.
ఇనేుళ్లు గడిచినా, మరికొన్ని ఏళ్లు గడిచిన తర్వాతైనా నయా ఉదారవాద ఆర్థిక విధానాల బాధితులుగా మెజారిటీ దళితులు సామాజిక, ఆర్థిక నిచ్చెనలో అట్టడుగునే బందీ అయిపోతారు. పాలక వర్గాలు, ఆధునిక భారత బూర్జువా శక్తులు కుల వ్యవస్థను ప్రోత్సహించడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. దళితులు, మరింతగా వెనుకబడిన వర్గాలవారు మరింత మిగులును ఉత్పత్తి చేసేలా వారితో మరింత ఉధృతంగా పనిచేయించుకునేందుకు కుల వ్యవస్థ అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతోంది. అందువల్ల పెట్టుబడిదారీ పూర్వ సంబంధాల్లో భాగంగా కులాన్ని చూడడం తప్పవుతుంది. ఫ్యూడల్‌ సమాజంలో కుల సంబంధాలు భాగంగా వున్నాయని చెప్పవచ్చు. ఆధునిక బూర్జువా సమాజంలో కులం అంతరించిపోతుందని, వర్గ సంబంధాలు ప్రాధాన్యంగా వుంటాయను భావన ఇందులో అంతర్లీనంగా వుంది. మన అనుభవంలో చూసినట్లైతే ఇదంతా పూర్తిగా తప్పుడు అవగాహనగా కనిపిస్తోంది. వర్గ పోరాటాలు, కుల వ్యతిరేక పోరాటాలు, దళితుల హక్కుల కోసం జరిగే పోరాటాల సమ్మేళనాన్ని నిర్మించడమే ముందుకు సాగాల్సిన ఏకైక మార్గంగా వుంది. 1930 కార్యాచరణ ప్రణాళికను ఆమోదించి 92 ఏళ్లయిన తర్వాత, 23వ పార్టీ మహాసభల సందర్భంగా అత్యంత హేయమైన కుల వ్యవస్థను నిర్మూలించేందుకు, కుల వ్యవస్థను శాశ్వతం చేయాలని కోరుతున్న శక్తులందరినీ పారదోలేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాల్సిందిగా మనందరం ప్రతిన బూనుదాం.