Jul 08,2022 16:25

ప్రజాశక్తి-జగ్గయ్యపేట రూరల్ :
జగ్గయ్యపేట రూరల్. జూలై 11న కలెక్టరేట్ల వద్ద ధర్నా గోడ పత్రికను గురువారం మండలంలోని షేర్ మహ్మద్ పేట గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అందనంతగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు  రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ప్రజలు కష్టాలో ఉంటే ఆదుకోవాల్సింది పోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మరింత మోయలేని భారాలను మోపుతోందని, రైతులు కౌలురైతులను, వ్యవసాయ కూలీలు, యువత, విద్యార్థులు, మహిళలు ఇలా అందర్నీ ప్రభుత్వలు ఒక చేత్తో ఇస్తూ మరొక చేస్తో పన్నులు వేసి లాగేసుకుంటున్నయ్యని, పన్నుల భారాలు ప్రజలు మోయలేక పోతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, ప్రజా సంస్థల పరిష్కారం కొరకు చలో కలెక్టరేట్ లను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కాకనబోయిన లింగారావు, షేక్ గౌస్ మియా, జె వెంకటరావు, ఎస్ రామనాథం తదితరులు పాల్గొన్నారు.