ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ 27వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నా కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులో సిపిఎం నియోజకవర్గ శాఖ కార్యదర్శిల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనటానికి వచ్చిన శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిర్బంధం ఉందని అన్నారు. విద్యుత్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కొరకు ఆందోళన చేయాలన్న కోర్టు పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కరెంట్ చార్జీలు విపరీతంగా పెంచుతున్నారని విమర్శించారు. టెక్నాలజీ పెరిగేకొద్దీ చార్జీలను తగ్గించాల్సింది పోయి పెంచుతున్నారని అన్నారు. ఆదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇది అంతా చేస్తుందని విమర్శించారు. టెక్నాలజీ పెరిగిన తరుణంలో విద్యుత్ యూనిట్ రూపాయికి అందించవచ్చు అన్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలో బిజెపికి అంట కాగుతూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నాయి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి కారణం బిజెపి కారణం అని అన్నారు. ఢిల్లీలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని బిల్లులను వైసిపి, టిడిపి మద్దతు తెలియజేస్తున్నాయని అన్నారు. కేవలం రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు విమర్శించుకుంటాయి గాని, బిజెపిని మాత్రం విమర్శించడం లేదని అన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బిజెపి పట్ల వారి వైఖరి తెలియజేయాలని అన్నారు. ఇదేవిధంగా బిజెపి పట్ల ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన వారు అవుతారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడాన్ని ఖండించిన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేసే వారిని చేయడం సబబు కాదని అన్నారు. అదేవిధంగా ప్రజల తమ సమస్యల పరిష్కారం కొరకు విజయవాడ ధర్నా చౌక్ లో కూడా ధర్నా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం లేదని విమర్శించారు. ఈనెల 25వ తేదీన అంగన్వాడీల ధర్నా ఉందని, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజల తమ సమస్యల పరిష్కారం కొరకు అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఆందోళన చేయడం పరిపాటి అని అన్నారు. ఢిల్లీలో పార్లమెంటు జరిగే సమయంలో అనేక ఆందోళన చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సబబు కాదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్రంగా ఎదగడానికి సిపిఎం కృషి చేస్తుందని అన్నారు. అందులో 20 నుండి 25 వరకు అసెంబ్లీ స్థానాలు పోటీ చేయాలని అనుకున్నట్లుగా తెలిపారు. పార్లమెంటు మూడు లేదా నాలుగు స్థానాలకు పోటీ చేస్తామని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో కేంద్రీకరించి నియోజకవర్గంగా ఉందని అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పనిచేస్తామని అన్నారు. వైసిపి టిడిపిలు రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపిని విడిచి, రాష్ట్ర అభివృద్ధి కొరకు పాటుపడాలని కోరారు.










