ప్రజాశక్తి-కడప : కడపలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపేశాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడపలోని కోపరేటివ్ కాలనీలో కుటుంబంతో నివస్తున్న వెంకటేశ్వర్లు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న కడప పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా అంచనా. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










