ప్రజాశక్తి - బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా ఆదేశాల మేరకు శుక్రవారం తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట మండలం, బీరంగి గ్రామంలో సివిల్ రైట్స్ డేని నిర్వహంచారు. ఈ కార్యక్రమానికి తహసిల్దార్ ధనుంజయులు, ఆర్ఐ బాలాజీ, ఏఎస్ఐ బొజ్జ నాయక్, కో- ఆప్షన్ మెంబర్ నాసర్, సర్పంచులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు పౌర హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. పౌరహక్కులను వినియోగించుకొనే స్వేచ్ఛను రాజ్యాంగం ప్రజలకు కల్పించిందన్నారు.పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.ప్రజలకు తరచు పౌర హక్కులపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామస్తులు హాజరయ్యారు.










