Sep 23,2023 17:24

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కార్మిక రాజ్యస్థాపనే లక్ష్యంగా సిఐటియు ఆవిర్భవించిందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఏ గఫూర్ అన్నారు.
సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన కార్మిక కర్షక భవన్ నందు సిఐటియు జిల్లా నిర్మాణ వర్క్ షాప్ ప్రారంభసమావేశం జరిగింది. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ దోపిడీ లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసమే సిఐటియు స్థాపన జరిగిందని అన్నారు. శనివారం కార్మికులు ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పాలకులు కార్మికులను కట్టు బానిసలుగా చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. పాలకులకు బుద్ధి చెప్పాలి అంటే సమాజంలో ఉండే కార్మికుల మొత్తాన్ని ఒక వర్గంగా ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని అన్నారు. కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు నిరంతరము అధ్యయనం చేయాలని అన్నారు. వారు ఎదుర్కొనే సమస్యలతో పాటు నివాస ప్రాంతాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అధ్యయనం చేసి వారిని సమీకరించి సంఘటిత పరిచి పాలకుల దౌర్జన్యాలకు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసినప్పుడే సిఐటియు లక్ష్యం నెరవేరుతుందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.రామాంజనేయులు అధ్యక్షతన నిర్మాణ వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ లో సి.ఐ.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు సిఐటియు జిల్లా నాయకులు పి నిర్మల, పి ఈరన్న, రామాంజనేయులు, సిహెచ్. సాయిబాబా, కె. ప్రభాకర్, జె.నాగేశ్వరరావు, పి .నాగరాజు, ఎస్. ఉమాదేవి, విజయ్, మహమ్మద్ రఫీ, జిల్లా నలుమూలల నుండి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.