Dec 26,2022 08:03

గొప్పగా చప్పుడు చేసేనని
ఎండుటాకుల్ని ఎప్పుడూ నమ్మకు
నువ్వు జారిపడినప్పుడు
అవి జాలి కూడా చూపవు
రెప్పపాటులో జారుకుంటాయి
పక్కకి చల్లగా తప్పుకుంటాయి

నిన్ను గమనించక, తలదించి ఉండేనని
విరిబాలలపై నెపుడూ విసుగు చెందకు
ఉపేక్షించేనని దిగులు పడకు
ప్రతి మలుపులోనూ
పరిమళమై వెన్నంటి ఉంటాయి.
నీ యాత్రను ప్రేమభరితం చేస్తాయి.

- డా.డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ,
94408 36931