చుక్కల సమస్యలకు.. చక్కటి పరిష్కారం :'చింతల'
వాల్మీకిపురం : ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యకు సిీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చక్కటి పరిష్కారం చూపించారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో చుక్కల భూముల రైతులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 4026 మంది రైతులు చుక్కల భూముల సమస్యతో బాధపడ్డారని, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుక్కల భూముల రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి చుక్కల భూములకు చక్కటి పరిష్కారం చూపారన్నారు. దీంతో చుక్కల భూములను సైతం రిజిస్టర్ చేసుకోవచ్చునని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఫిరోజ్ ఖాన్, నాయకులు చింతల ఆనంద రెడ్డి, కేశవ రెడ్డి, రఘు, అబ్దుల్ కలీమ్, శివా రెడ్డి పాల్గొన్నారు.










