Dec 02,2022 22:12

సమావేశంలో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి

కదిరి టౌన్‌ : చట్టాలపై అవగాహన అవసరమని సీనియర్‌ సివిల్‌ జడ్జి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలలో సందర్భంగా స్థానిక ఎస్సీ బాలికల హాస్టల్‌లో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా భారత రాజ్యాంగం గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించగా అందులో ప్రతిభ కనపర్చిన ముగ్గురు విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ జడ్జి మరి ఎస్‌ ప్రతిమ , న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లోకేశ్వర్‌ రెడ్డి , సీనియర్‌ న్యాయవాది నరసింహులు, హాస్టల్‌ వార్డెన్‌ ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు.