అవగాహన సదస్సులో పాల్గొన్న మహిళలు
రొద్దం : మహిళా చట్టాలపై అవగాహన సదస్సును టింబక్టివ్ కలెక్టివ్ వారి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. నారనాగి పల్లి గ్రామంలో అనంతశక్తి సిఇఒ లావణ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహాశక్తి నుంచి రమేజా,ప్రతిభ సొసైటీ నుంచి నరసింహ, వరలక్ష్మి, జయశ్రీ పాల్గొని మాట్లాడారు. బాల్యవివాహాలు, గృహహింసపై నాటిక రూపంలో అవగాహన కల్పించారు.










