Sep 26,2023 19:03

మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి యామిని

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలన్న ఉద్ధేశ్యంతోనే న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కె. వాణి పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ సి. యామిని ఆదేశాలు మేరకు మంగళవారం తోటపల్లిగూడూరు మండలం పేడూరు గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ వాణి మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్టిన్నట్లు తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులేనని ఆమె చెప్పారు. గ్రామాల్లో న్యాయ సలహాలు అందించడానికి సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. పేడూరు గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌ గా గుర్తించి ఇక్కడ న్యాయ విజ్ఞాన సదస్సు పెట్టడం జరిగిందని ఆమె చెప్పారు. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే తమ బందం ద్వారా పరిష్కరిస్తామన్నారు. సభ్యులు ఎన్‌జిఒస్‌ ఎం సుబ్బారెడ్డి, ఎల్‌ కవిత రెడ్డి, అడ్వకేట్‌ డిఎస్‌ కామేశ్వరి, ఎంఎస్సీ రోహిత్‌, వాలంటరీ ఏ. పెంచల రెడ్డి, ఎం పెంచల నరసయ్యలు పనిచేస్తారన్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జంపాని కుమార్‌, తహశీల్దార్‌ వి. లావణ్య, ఎంపీడీవో కే. హేమలత, ఎంఇఒ జయ రామ నాయుడు, ఐటిడిఎ ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఆర్‌. శ్రీనివాసులు, ఎన్‌జిఒ ఎం. సుబ్బారెడ్డి, ఎల్‌ కవిత రెడ్డి, అడ్వకేట్‌ డిఎస్‌ కామేశ్వరి, ఎన్‌.ఎస్‌.వి రోహిత్‌, సర్పంచ్‌ ఝాన్సీ రాణి, ప్యారా లీగల్‌ వాలంటరీ ఏ. పెంచల్‌ రెడ్డి, ఎం పెంచల నరసయ్య పాల్గొన్నారు.