చట్టాలను దుర్వినియోగం చేయొద్దు
ప్రజాశక్తి-కావలి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాజకీయ ప్రత్యర్థులపై ఎస్‌సి ఎస్‌టి చట్టాలను ఉపయోగించి ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.మల్లి పేర్కొన్నారు. మంగళవారం కావలి పట్టణంలోని ఆర్.డి.ఒ కార్యాలయంలో ఎస్‌సి ఎస్‌టి చట్టాలను దుర్వినియోగం చేయడం అన్యాయమని ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాజకీయ ప్రత్యర్థులపై ఎస్సీఎస్టీచట్టాలనుఉపయోగించి కటకటాలపాలు చేస్తున్నారన్నారు. ప్రతి సంఘటన వెనుక 10 ఎస్‌సి ఎస్టఇ చట్టాలు ప్రయోగిస్తున్నారని గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎంపిటిసి ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులపై చట్టాలను ప్రయోగించి 307 సెక్షన్లు జోడించి కక్షలు తీర్చుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో యానాది సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బాపట్ల సత్యవతమ్మ, ఉప్పు మోహన్రావు, జె విజయరత్నం, వాసు, మస్తానయ్య, వీర రాఘవులు, ఎం.శ్రీనివాసులు, కే పద్మ, తదితరులు పాల్గొన్నారు.










