ప్రజాశక్తి - కడపప్రతినిధి
జిల్లా ఎదుర్కొంటున్న ప్రధాన సమ స్యల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చిం చడంపై ప్రజానీకం దృష్టి నిలిపింది. ప్రతి పక్ష టిడిపి నుంచి పాలకపక్షం తప్పిదాలను నిలదీసే అవకాశాలు తగ్గిన నేపథ్యంలో సమగ్ర చర్చ దేవతా వస్త్రంలా మారిన సంగతి తెలిసిందే. జిల్లా ప్రధా నంగా వ్యవసాయాధికారి ప్రాంతం. ఇటువంటి జిల్లాలో రబీలో సాగు నత్తనడకన సాగుతుండడం, ఎరువులు కొరత ఏర్పడినట్లు రాష్ట్ర సమీక్షా సమా వేశంలో వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని అన్నమయ్య, గండి కోట నిర్వాసితుల మొర, పింఛా, ఎల్‌ఎస్‌పి గేట్ల మరమ్మతులు, సర్వరాయ సాగర్, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ల లీకేజీ, యురేనియం పైప్‌లైన్ పనుల పురోగతిపై ప్రధానంగా చర్చించాల్సి ఉంది. 2021 నవంబర్ వరదల్లో అన్నమయ్య రిజర్వాయర్ మట్టి కట్ట తెగిన సందర్భంగా సుమారు ఆరు గ్రామాల ప్రజానీకం నిర్వాసితులుగా మారిన సంగతి తెలిసిందే. అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వాసితులను ఆదు కుంటామని హామీనిచ్చారు. ఇప్పటికీ హామీలో ఆశించిన పురోగతి కనిపించ లేదు. ఇదిలాఉండగా పింఛా, ఎల్‌ఎస్‌పి గేట్లకు మరమ్మతులు, సర్వరాయసాగర్, బ్రహ్మంసాగర్ లీకేజీల పరిష్కారం, యర్ర బల్లి - పార్నపల్లి పైప్ లైన్ పనుల్లో ఆలస్యం కారణంగా యురే నియం నిర్వాసిత గ్రామాలకు తాగునీటి సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో సమాధానం రాబట్టాల్సి ఉంది. ప్రతియేటా వర్షాకాలంలో వచ్చే వరదల నుంచి బుగ్గవంక పరీవాహక ప్రాంతాల పరిర క్షణపై దృష్టి సారించాల్సి ఉంది. గండికోట నిర్వా సితులకు రూ.ఏడు లక్షల పరిహారానికి అదనంగా మరో రూ.మూడు లక్షలను అందిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తు ండడం ఆం దోళన కలిగిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాకు జీవనాడిగా పేర్కొంటున్న ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పనుల ప్రారంభం ఊరిస్తూనే ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముంగిట వైసిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏర్పాటు చేస్తా మని ఇచ్చిన హామీ అమలుకు నోచుకో లే దు. జన వరి చివరి వారంలో జెఎస్‌డబ్ల్యూ సంస్థ ఆధ్వ ర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పనులను ప్రారం భిస్తామని ప్రకటించిన హామీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. దీనికితోడు కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమల ఏర్పాటుకు అవ సరమైన నీటి సర ఫరా పైప్‌లైన్ ఏర్పాటుకు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా జిల్లాలోని డివైఎఫ్‌ఐ వంటి యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక హౌదా సాధన సమితి సమరయాత్ర 2. 0 ప్రారం భమైం ది. దీనికి తోడు 15 ఫైనాన్స్ నిధుల్లో 60 శాతం కరెంటు ఛార్జీలను మళ్లించ డంపై సర్పం చుల్లో ఆగ్రహం వ్యక్తమవు తోంది. దీంతోపాటు జిల్లాలోని 24 సిపిడబ్య్లు స్కీములకు సుమారు ఆర్నెళ్ల కిందట నిర్వహించిన టెండర్లలో సుమారు ఆరు నుంచి ఎని మిది స్కీములకు లెస్‌తో దక్కిం చుకున్న కాంట్రాక్టులను టెండర్‌దా రులకు కట్టబె ట్టకుండా కె2 పేరుతో తమ అస్మదీయులకు కట్ట బెట్టడం, బిల్లుల చెల్లింపులు చేయడంలో రాజకీ యం చేయడం విమర్శలకు ఆస్కారాన్ని కలిగిస్తోంది.










