ప్రజాశక్తి-మేడ్చల్ : మద్యం మత్తులో కారు భీభత్సం సృష్టించింది. కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మేడ్చల్ జిల్లా కీసర వద్ద తెల్లవారుజామున మైనర్లు మద్యం మత్తులో కారు అతి వేగంగా నడపడంతో కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. కాగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో మద్యం బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో కారు నడపడం వలెనే ప్రమాదం జరిగినట్టు పోలీసు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










