Feb 18,2022 07:43

చంఢీఘర్‌ : ఉత్తరప్రదేశ్‌, బీహార్‌కు చెందిన 'భయ్యాలు' పంజాబ్‌ను ఏలేందుకు వస్తున్నారని, ఆ అర్హత వారికి లేదంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా తప్బుపట్టారు. అవి చన్నీ 'విభజన, వేర్పాటువాద రాజకీయాలు'ను ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. అభర్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. చన్నీ వ్యాఖ్యలు యుపి, బీహర్‌ ప్రజలనే కాకుండా మహనీయులైన గురు రవిదాస్‌, గురు గోబింద్‌ సింగ్‌లను కూడా అవమానించడమేనన్నారు. ఆమాద్మీ పార్టీపైనా మోడీ మరోమారు విమర్శలు గుప్పించారు. అధికారం చేజిక్కించుకోవడం కోసం కేజ్రీవాల్‌ వేర్పాటు వాద రాజకీయాలను ఆశ్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు.