Jan 08,2023 21:37

ఫొటో : చంద్రగిరి రోసయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

చంద్రగిరి రోసయ్య 14వ వర్థంతి
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : పేదల సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు చంద్రగిరి రోసయ్య అని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జొన్నలగడ్డ వెంకమరాజు అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం బుచ్చిరెడ్డిపాళెంలో జోన్నవాడ సెంటర్లో రోసయ్య స్థూపం వద్ద ఆయన 14వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణంలో పేదప్రజల నివాసాలు కోసం పోరాటాలు చేసి సుమారు 500 కుటుంబాలకు కాలువ పోరంబోకు స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేశారని కొనియాడారు.
సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున మాట్లాడుతూ జక్కా వెంకయ్య ఎంంల్‌ఎగా ఉన్న సమయంలో కూరగాయల మార్కెట్‌, ముస్లిం మైనార్టీలకు షాదీమంజిల్‌ నిర్మించేందుకు కృషి చేశారన్నారు. ఆయన చనిపోయే వరకు పేదప్రజల కోసం, పార్టీ కోసం పనిచేశారన్నారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి పొతంశెట్టి శ్రీనివాసులు, అవాంఛిత నాయకులు షేక్‌ జానీబాషా, డివైఎప్‌ఐ నాయకులు దత్తళ్రీ కోటయ్య, నాయకులు ఓంటేరు ప్రభాకర్‌, దుర్గా ప్రసాద్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.