May 15,2023 21:39

రాయచోటి : పాదయాత్రలో రమేష్‌కుమార్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులు

రాయచోటి : రాష్ట్రం అభివద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌. రమేష్‌ కుమార్‌ రెడ్డి, టిడిపి నియోజకవర్గ నాయకులు సుగువాసి ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాబు యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావ యాత్ర నిర్వహించారు. అన్నమయ్య సర్కిల్‌ నుంచి సాగిన పాదయాత్రలో పలు కూడళ్లలో ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్రలో దారి పొడవునా బాణసంచాలు పేలుస్తూ గజమాలలు వేస్తూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌బాబు యువ గళం పాద యాత్రతో వైసిపి ప్రభుత్వానికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి పార్టీని గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాషా, జడ్‌పిటిసి మాజీ సభ్యులు నర్సారెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షులు ఖాదరవల్లి, రూరల్‌ అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, టిడిపి నాయకులు రామాం జనేయులు, సుగువాసి శ్రీనివాసులు, టిడిపి పార్లమెంట్‌ అధికార ప్రతినిధి వతన్‌ నిస్సార్‌, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బి.కొత్తకోట : టిడిపి నాయకులపై వైసిపి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు బయపడేది లేదని టిడిపి రాస్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి ఎం.ఎస్‌.ఫర్వీన్‌ తాజ్‌ పేర్కొన్నారు. మదనపల్లి జిల్లా సాధన కోసం జెఎసి ఆధర్యంలో తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోటలో జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి దొమ్మలపాటి రమేష్‌తో పాటు 22 మందిపై తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. సోమవారం మదనపల్లి కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. కార్యక్ర మంలో చిక్కిలాల బాబు, వెంకటేశ్వర్లు,మనోహర్‌ రెడ్డి, నూర్‌అహ్మద్‌, గట్టుచంద్ర, డి.నారాయణ, మొటుకు శివ, తలారి మంజు పాల్గొన్నారు. రైల్వేకోడూరు : యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కస్తూరి ఆధ్వర్యంలో లోకేష్‌ కు సంఘీభావంగా టిడిపి శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు, కమతంనాగరాజు, గునిపాటి చెన్నరాయుడు, ముక్కర శంకరయ్య నాయుడు, అనిత దీప్తి, రమేష్‌, చిన్న పాల్గొన్నారు. పీలేరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పీలేరు నియోజకవర్గం ఇన్‌చార్జి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. యువగళం పాదయాత్ర ప్రారంభమై 100 రోజులు పూర్తయిన సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంఘీభావ యాత్రల్లో భాగంగా, సోమవారం పీలేరు-చిత్తూరు మార్గంలోని సబ్‌ స్టేషన్‌ నుంచి కిషోర్‌ కుమార్‌ రెడ్డి టిడిపి శ్రేణులతో కలిసి సంఘీభావ పాదయాత్రను చేశారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు మల్లారపు రవి ప్రకాష్‌ నాయుడు, మాజీ జడ్‌పిటిసి డాక్టర్‌ మల్లెల రెడ్డి బాష, కోటపల్లి బాబు రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వారణాసి శ్రీకాంత్‌ రెడ్డి, పురం రామ్మూర్తి, లక్ష్మీ కర, పోలిశెట్టి సురేంద్ర, కంచు సూరి, రమణారెడ్డి, మహమ్మద్‌ పీర్‌, రెడ్డప్ప రెడ్డి, అమర్నాథరెడ్డి, తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌ : మదనపల్లి పట్టణంలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి దొమ్మలపాటి రమేష్‌ అధ్యక్షతన, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లె లో ప్రజలను చైతన్య పరుస్తూ 7 కి.మీ సంఘీభావ పాదయాత్ర ను నిర్వహి ంచారు. కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, పట్టణ అధ్యక్షులు భవాని ప్రసాద్‌, మాజీ టౌన్‌ బ్యాంకు చైర్మన్‌ నాదెళ్ల విద్యా సాగర్‌, రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతినిది అర్జె వెంకటేష్‌, పట్టణ ఉపాధ్యక్షులు యశస్విరాజ్‌, చాణుక్య తేజ, ఎర్రబల్లి వెంకటరమణా రెడ్డి, తెలుగుయువత ప్రభాకర్‌లు పాల్గొన్నారు.