Nov 07,2023 22:50

ప్రజాశక్తి-యంత్రాంగం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పలువురు టిడిపి నాయకులు అన్నారు. మంగళావరం బాబు ష్యూరిటీ కార్యక్రమం ప్రచారంలో వారు పాల్గొన్నారు. కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు 6వ డివిజన్‌లో పర్యటించారు. టిడిపి మహాశక్తి మేనిఫెస్టో కరపత్రాలను స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బుంగా నాగరాజు, పోలిపల్లి జగన్‌, ఒమ్మి బాలాజీ, గాది శివ, తుమ్మల రమేష్‌, షావుకారు బాబులు, గదుల సాయిబాబా, చిట్నీడి దొర, రాయుడు లక్ష్మణరావు, బొంతు సత్యనారాయణ ప్రసాద్‌, బత్తుల ఉమాదేవి, జారుల్లాఖాన్‌, కరీముల్లా పాల్గొన్నారు. యు.కొత్తపల్లి అమీనాబాద్‌ గ్రామంలో పిఠాపురం మాజీ ఎంఎల్‌ఎ ఎస్‌విఎస్‌ఎన్‌.వర్మ పర్యటించారు. గ్రామాల్లో సమస్యలను ప్రజలు ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానంద రెడ్డి, సికోటి నానాజీ, జగన్నాథం, మడద విగేష్‌, నాగేశ్వరరావు, కనకరాజు, తాతారావు, అప్పన్న, అప్పారావు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ పెద్దాపురం ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్‌ ఉండూరు గ్రామంలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో చల్లా బుజ్జి, కుర్రా నారాయణ స్వామి, పెంకే వెంకటేష్‌ పాల్గొన్నారు.