Nov 06,2023 23:13

ప్రజాశక్తి-కాకినాడ, గండేపల్లి రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు అన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కొండబాబు సోమవారం 38, 41వ డివిజన్లలో పర్యటించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంతో పురోగమించిన రాష్ట్రం నేడు వైసిపి ప్రభుత్వ పాలనలో అధఃపాతాళానికి పడిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, మెంటారావు, జొన్నాడ వెంకటరమణ, బచ్చు శేఖర్‌, చింతా పేర్రాజు, ముగ్గుల్ల బాబురావు, అంకం గణేష్‌, కోనాల కృష్ణ, మజ్జి రాంబాబు, నానావరపు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గండేపల్లి టిడిపి అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. బొర్రంపాలెంలో పార్టీ శ్రేణులతో కలసి ఆయన ప్రచారం చేశారు.