Feb 23,2023 22:07

కార్యకర్తలు సమావేశంలో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

          ప్రజాశక్తి-బత్తలపల్లి   ప్రజలు అభివృద్ధి చెందాలన్నా.. రాష్ట్రాభివృద్ధి సాధించాలన్నా టిడిపి అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంతోపాటు సంజీవపురం, మూష్టూరు, మాల్యవంతం, అప్పరాచెరువు గ్రామాల్లో నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రపై టిడిపి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం, నాయకులు కల్పిస్తున్న అడ్డంకులను ఎదురొడ్డి యువనేత చేపట్టిన యువగళం పాదయాత్ర వచ్చే నెలలో జిల్లాలోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. కావున పాదయాత్ర విజయవంతం అయ్యేలా యువకులు చూడాలన్నారు. ప్రతి గ్రామం నుంచి ప్రజలు పాదయాత్రలో పాల్గొనేలా చూడాలన్నారు. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించి రాబోయే శాసనసభ ఎన్నికలకు పులివెందుల నుంచే నాంది పలకాలని పిలుపునిచ్చారు.
కష్ట సమయంలో ధర్మవరం బాధ్యతలు
ధర్మవరంలో ఉన్న నాయకుడు పార్టీని వదిలేసిపోతే కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకునేందుకు అధినేత చంద్రబాబు పిలిచి తనకు బాధ్యతలు అప్పజెప్పారని, అప్పటి నుంచి అనుక్షణం కష్టపడుతూనే ఉన్నానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అభ్యర్థులు కూడా నిలబడలేని పరిస్థితి ఉన్న సమయంలో చంద్రబాబు నాకు బాధ్యతలు అప్పజెప్పారన్నారు. అధికార పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీరు మాత్రం పార్టీ వీడకపోవడం గర్వంగా ఉందన్నారు. అప్పటికే రాప్తాడులో పని చేస్తున్న తనపై ధర్మవరం బాధ్యతను ఎంతో నమ్మకంతో అప్పజెప్పారన్నారు. అందుకే తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలనైంత వరకు అభ్యర్థులను బరిలో నిలిపి పార్టీని నిలబెట్టామన్నారు. ఆ రోజుల్లో పరిటాల రవి కూడా ఇలాంటి కష్ట సమయంలోనే ఇక్కడ కార్యకర్తలకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇటు ధర్మవరం, అటు రాప్తాడులో రెండుచోట్ల తమ తడాఖా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ధర్మవరంలో ఒకరితో కాకుండా ఇద్దరు రాక్షసులతో పోరాడాల్సి వస్తోందన్నారు. పాదయాత్రలో మండలంలో ఉన్న సమస్యలు లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ గోనుగుంట్ల నారాయణరెడ్డి, టిడిపి కుమ్మర శాలివాహన సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ మదనాపు పోతలయ్య, సురేంద్ర నాయుడు, గోనుగుంట్ల అమర్నాథ్‌ చౌదరి, నెట్టెం రమణ, చల్లా శ్రీనివాసులునాయుడు, అయ్యప్ప, శ్రీనివాసులు, సుధీర్‌, నెట్టెం అశోక్‌, బోయపాటి గోపాల్‌, రవీంద్ర, సుబ్బరాయుడు, గంటాపురంజగ్గు, ప్రవీణ్‌, రాము, జక్కంపూటి నాగభూషణ, గజ్జిరామయ్య, జొన్నలగడ్డ రంగానాయుడు, కేశవరెడ్డి, గురుప్రసాద్‌, వడ్డేబొజ్జప్ప, పాముల పెద్దన్న, సూర్యనారాయణ, నాగరాజు, మోహన, అప్పస్వామి, సదాశివ, చౌదరి తదితరులు పాల్గొన్నారు.