Jan 17,2023 18:14

చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేస్తున్న చమర్తి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ :ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును పుంగనూరు, రొంపిచర్లలో ప్రముఖ విద్యావేత్త, రాజంపేట నియోజకవర్గ సీనియర్‌ నాయకులు చమర్తి జగన్‌మోహన్‌రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పాలని, కార్యకర్తలకు అండగా నిలవాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చంద్రబాబు సూచించినట్లు చమర్తి పేర్కొన్నారు.