ఫొటో : మాట్లాడుతున్న బీద రవిచంద్ర
చంద్రబాబునాయుడు పర్యటనపై సమీక్ష
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో శనివారం కావలి రూరల్ మండలంలోని 6వ, 7వ క్లస్టర్ ఇన్‌ఛార్జులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవుల రామకృష్ణ, ఉప్పాల వెంకట్రావుల సారథ్యంలో సన్నాహక సదస్సు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ 29వ తేదీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షలు నారా చంద్రబాబునాయుడు కావలి పర్యటన సందర్బంగా చేయాల్సిన కార్యాచరణపై మాట్లాడారు. తదుపరి గ్రామాలవారీగా నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కావలిరూరల్ మండలంలోని అన్ని పంచాయతీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని చంద్రబాబు పర్యటనను దిగ్విజయం చేయడానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు.










