ప్రజాశక్తి-యంత్రాంగం
స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ మాజీ సిఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణుల సంబరాలు నిర్వహించారు.
మండపేట చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో మండపేట ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. స్థానిక కలువు పువ్వు సెంటర్లో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, వాకచర్ల గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం చంద్రబాబుకు బెయిలు మంజూరు చేయడంతో మండలంలోని గ్రామాలలో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఆలమూరు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడంపై స్థానిక బస్టాండ్ సెంటర్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంఎల్‌ఎ బండారు సత్యానందరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలోని 216 బ జాతీయ రహదారిపై వెళుతున్న చంద్రబాబుకి అడుగడుగునా పార్టీ శ్రేణులు మంగళవారం రాత్రి ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడం తో పట్టణంలో టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రామచంద్రపురంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రెడ్డిసుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. కాట్రేనికోన చంద్రబాబుకు మంజూరు చేయడం పట్ల టిడిపి శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. గేట్ సెంటర్లో టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జొన్నాడ రాజారావు, వెంట్రు సుధీర్, విత్తనాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అయినవిల్లి చంద్రబాబు బెయిల్ పై విడుదలైన సందర్భంగా ముక్తేశ్వరం సెంటర్లో టిడిపి శ్రేణుల సంబరాలు చేసుకున్నారు. అమలాపురం రూరల్ చంద్రబాబు బెయిల్ రావడంతో టిడిపి నాయకులు పరమట శ్యామ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కపిలేశ్వరపురం చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో మండల టిడిపి అధ్యక్షులు ముత్యాల వెంకటరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉప్పలగుప్తం చంద్రబాబుకు బెయిల్ లభించడం పట్ల మండలంలో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టిడిపి మండల అధ్యక్షుడు అరిగెల నానాజీ ఆధ్వర్యర్యాన చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గొల్లవిల్లి సెంటర్ లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. కార్యక్రమంలో నాయకులు పోలిశెట్టి భాస్కరరావు,పెమ్మి రెడ్డి సత్యనారాయణ, చిక్కం పెద్దబ్బులు తదితరులు పాల్గొన్నారు.కొత్తపేట చంద్రబాబుకు బెయిల్ రావడంపై కొత్తపేటలో సంబరాలు చేశారు. మండల టిడిపి అధ్యక్షులు కంఠంశెట్టి శ్రీనివాసరావు, గ్రామపార్టీ అధ్యక్షుడు వాసంశెట్టి సత్య నారాయణ మరియు టిడిపి శ్రేణులు పాల్గొన్నారు. మామిడికుదురు చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో మండల టిడిపి అధ్యక్షులు మొల్లేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.కార్యక్రమంలో పాటి గోవిందు, సద్ సిహెచ్.కిషోర్, కోలా సత్తిబాబు, పితాని వెంకటేశ్వరరావు, గుడిమెళ్ళం కాశీ, నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు. అమలాపురం చంద్రబాబుకి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లవరం మండలం టిడిపి కార్యాలయంలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కడలి వెంకటేశ్వరరావు, తోట నరసింహారావు, కాండ్రేగుల వీర వెంకట సత్యనారాయణ, నార్గన శ్రీనివాసరావు, నడింపల్లి సుబ్బరాజు, వేగిరాజు సుబ్బరాజు, మామిడిశెట్టి శ్రీరామ్, రాసూరి రాంబాబు, కడలి రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.అంబాజీపేట చంద్రబాబుకు బెయిల్ ద్వారా బయటకు రావడంతో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుడాల ఫణి ఆధ్వర్యంలో అంబాజీపేట సెంటర్లో టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సత్యనారాయణ బొంతు పెదబాబు, అరిగెల బలరామమూర్తి, గణపతి వీర రాఘవులు, దువ్వూరి సురేష్, ఎన్‌వి.సుబ్బారావు, పెదపూడి శ్రీను, రవణం రాము, ఎమ్.కిరణ్ కుమార్, దొమ్మేటి శ్యామ్,అయ్యగారి సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.










