ప్రజాశక్తి-వలేటివారిపాలెం :ఈ నెల 28న కందుకూరు పట్టణంలో జరగనున్న టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటనకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. ఆయనతో పాటు రాష్ట్ర పార్టీ కార్యనిర్వహణాధికారి, మాజీ శాసనసభ్యులు దివి శివరాం ఆదివారం మండలంలో పర్యటించారు. గ్రామాలకు వెళ్లి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశలు నిర్వహిరచారు. జనసమీకరణ చేయాలని సూచించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శివరాం మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మండల పార్టీ బాధ్యులు మాదాల లక్ష్మీ నరశింహం, కూనిపాలెం సర్పంచ్ నవులూరి రాజారమేష్, మాలకొండ దేవస్థాన మాజీ చైర్మన్ చెరువుపల్లి మాల్యాద్రి, నాయకులు వలేటి నరశింహం, కాకుమాని ఆంజనేయులు, హర్ష, గట్టమనేని చెంచునాయుడు, సాదు చెన్నకేశవులు పాల్గొన్నారు.










