Dec 31,2022 20:04

ఫొటో : మాజీ సిఎం చంద్రబాబును కలిసిన చెంచలబాబు

చంద్రబాబాకు చెంచలబాబు శుభాకాంక్షలు
ప్రజాశక్తి-ఉదయగిరి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పోనేబోయిన చెంచలబాబుయాదవ్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శనివారం జిల్లాలోని కోవూరు నియోజకవర్గం రాజుపాలెంలో ఆయనను మర్యాదపూర్వక కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అడ్వాన్స్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారన్నారు. ప్రతిఒక్కరూ ఐక్యతతో పాల్గొని చేపట్టి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యకర్తలకు అండగా ఉండి వారికి భరోసా కనిపించాలన్నారు. పార్టీ గెలుపునకు జిల్లాలో విజయ కేతాలు వినిపిస్తున్నాయని రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలకు ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారన్నారు.