Feb 01,2023 19:56

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్‌

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌: రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 5వ తేదీన చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ పేర్కొన్నారు. బుధవారం పురపాలక కార్యాలయంలో మున్సిపల్‌ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులకు, స్కీం వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేస్తోందన్నారు. నిర్బంధాల ద్వారా ఉద్యమాల అణచివేతకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మతోన్మాద బిజెపి నుండి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు ఓబయ్య, లక్ష్మీదేవి, ప్రసాద్‌, రమణ పాల్గొన్నారు.