రొద్దం : ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చలో ఢిల్లీ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు గంగాధర్, ఫకృద్దీన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నారాయణ, అరుణ, గంగాధర్, అనిత, రామాంజినమ్మ, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం :మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు, రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్పీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చలో ఢిల్లీకి సంబందించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 5వ తేదీన ఢిల్లీ నగరంలో లక్షల మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి నరసింహప్ప, నాయకులు రామకృష్ణ, అత్తర్ బాబా, జబివుల్లా, చంద్ర, జాఫర్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.










