చలివేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి-ఉదయగిరి : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పాదాచార్లకు, అర్జీదారులకు వేసవి తాపాన్ని తీర్చేందుకు శనివారం తహశీల్దార్ సానా శ్రీనివాసులు రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో కార్యాలయానికి వచ్చే ప్రజలు పాదాచార్యుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యాలయం ఆవరణంలో సబ్ రిజిస్టర్, సబ్ ట్రెజరీ కార్యాలయం సమీపంలో పోలీస్ స్టేషన్ ఉండడంతో సేవల పొందేందుకు ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉన్నారని వారి దాహార్తి తీర్చుకునేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు చేసామన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ షేక్ సంధాని, మండల సర్వేయర్ రవి కుమార్, విఆర్‌ఒలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.










