Oct 04,2022 22:31

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: స్థానిక చిట్టినగర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో అమ్మవారు యాత్రికులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి దర్శించుకుని పట్టు చీర సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్‌ను ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో సత్కరించారు. అలాగే అమ్మవారిని ఏలూరు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌ సిహెచ్‌ఆర్‌వి స్వామి, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు పిళ్లా రవి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.