Apr 03,2023 21:52

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిపి కేతా వేణుగోపాల్‌రెడ్డి

చిత్త శుద్ధితో పని చేయాలి
ప్రజాశక్తి-ఆత్మకూర్‌ అర్బన్‌ : సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు చిత్త శుద్ధితో పని చేసి గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి తెలియజేశారు. సోమవారం మండలంలోని మురగళ్ల సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి తగిన సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సర్వీసులను క్రమబ్ధీకరించి తగిన విధంగా పే స్కేల్స్‌ ఇచ్చి రెగ్యులర్‌ చేశామన్నారు.
కాబట్టి అందరూ చిత్త శుద్ధితో పని చేసి ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని ఆయన కోరారు. సమావేశంలో పాల్గొన్న ఎంపిడిఒ సి.శ్రీనివాసులు ప్రసంగిస్తూ గ్రామంలో మొత్తం 119 సమస్యలు నమోదు కాగా 61సమస్యలు పరిష్కరించామని మిగిలిన 58 సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎంపిడిఒ కోరారు. గ్రామ సర్పంచ్‌ పువ్వాడి హరిత, పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌, వి.ఆర్‌.ఒ. ఖాజా రంతుల్లా, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.