ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : పట్టణ సమీపంలో గల చిత్రావతి నది పరివాహక ప్రాంతంలోని వ్యర్థ పదార్థాలు తొలగింపు శ్రమదాన కార్యక్రమాన్ని టిడిపి నాయకులు మంగళవారం చేపట్టారు. టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, ఆయన మిత్రులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నదికి సమీపంలో ఉన్నవారు, ఇతరులు ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థ పదార్థాలు వేయడం ఆ ప్రాంతం దుర్గంధం వెదజల్లుతోంది. నదిని చూడటానికి వచ్చే పర్యాటకులు భక్తులు ఇబ్బందులు గమనించి వ్యర్థ పదార్థాలు తొలగించే పనికి స్వచ్ఛందంగా పూనుకున్నారు. ఈ సందర్భంగా సామ కోటి ఆది మాట్లాడుతూ సంబంధిత అధికారులకు పలుమార్లు తెలిపిన పట్టించుకోలేదన్నారు. దీంతో నది ఒడ్డున పరిశుభ్రంగా ఉంచడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అమ్మినేని కేశవ నాయుడు, ఎం. మురళి, హనుమంతు, వెంకట రాముడు, రామకృష్ణ, సుధాకర్, రామచంద్ర పాల్గొన్నారు.










