Mar 23,2023 22:46

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, మహిళలు, తదితరులు

పుట్టపర్తి రూరల్‌ : చిరుధాన్యాలు వాడడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పెడపల్లి సెక్టార్‌ అంగన్వాడీి సూపర్‌వైజర్‌ నాగరాణి తెలిపారు. ఈ మేరకు ఆమె పుట్టపర్తి మండల పరిధిలోని నిడిమామిడి పంచాయతీ కొత్తూరు గ్రామంలో గురువారం నిర్వహించిన 'పోషన్‌ పక్వాడా కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు, మినుములు, ఉలవలు, అరికెలు, కొర్రలు, ఊదలు రోజువారి ఆహారంలో తీసుకోవడం వలన ఎంతో ఉపయోగకరమని అన్నారు. వీటివల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయని తెలిపారు. ఉబకాయం పోయి, జీర్ణశక్తి పెంపొందుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కెసి. రంగన్న, నిడిమామిడి సర్పంచి లతా బాలకృష్ణ, పంచాయతీ సెక్రెటరీ పుష్ప, మహిళా పోలీసులు నాగమణి, బేబీ రాణి, అంగన్వాడీ టీచర్లు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.