విద్యార్థికి మెమోంటో అందిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-హిందూపురం : చిన్నారుల ఆలోచనలకు ప్రతిరూపాలు వారు చేసిన అద్భుత ప్రయోగాలని ప్రవేటు స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు అన్నారు. పట్టణంలోని అల్ హిరా పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను పాంచజన్య శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారి గంగప్ప, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ రహమత్ ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యార్థులు రూపొందించిన వివిధ నమూనాలను వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ రహమత్ మంచి ప్రయోగాలు చేసిన విద్యార్థులకు నగదు బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు వేణుగోపాల్, రీయాజ్, పాఠశాల కరస్పాండెట్ రీయాజుల్లా తదితరులు పాల్గొన్నారు.










