Jan 10,2023 20:38

సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : రాష్ట్రంలో సభలు, ర్యాలీలు, రోడ్‌షోలను నిషేధిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జిఒ-1ని రద్దు చేయాలని మంగళవారం రాష్ట్ర కమిటి పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు హోరెత్తాయి. జిఒ ప్రతులను దగ్ధం చేశారు. ఆయా మండలాల్లో రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. రాయచోటి పట్టణంలో మండల ప్రధాన కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి అధ్యక్షతన స్థానిక తాశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు మాట్లాడుతూ భావప్రకటనకు ఆప్రజాస్వామికమైన జిఒను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను, ఉద్యోగుల, కార్మికుల, నిరుద్యోగుల సమస్యలను నిరక్ష్యం చేస్తూ వాటి గురించి మాట్లాడిన ర్యాలీలు, సభలు నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు తప్పకుండా పోలీస్‌ రాజ్యంగా చేయాలని చూస్తున్న సిఎం జగన్మోహన్‌రెడ్డి నియంతృత్వ వైఖరి మానుకోవాలని డిమాండ్‌ చేశారు. బ్రిటిష్‌ కాలంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారిపై ఈ జిఒను అప్పుడు బ్రిటీష్‌ ప్రభుత్వం అమలు చేసిందని ఇప్పుడు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం బ్రిటిష్‌ కాలం 1861 నాటి జిఒలను అమలు చేయడం చాలా దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి నియంతృత్వ విధానాల ద్వారా ప్రజాస్వామ్య హక్కులను రాజ్యాంగ హక్కులను పూర్తిగా హరించి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో నాయకులు ఖాజాబి, నాగమణి, అరుణ, అమ్ములమ్మ, ప్రవీణ, గ్రామ సేవకులు నర్సింహులు, రామ్మోహన్‌, భవన నిర్మాణ కార్మికులు రవి, సురేష్‌ విద్యుత్‌ కార్మికుల సంఘం నాయకులు నాగేశ్వర గౌడ్‌ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : పురపాలక కార్యాలయంలో మున్సిపల్‌ కార్మికులతో కలిసి జిఒ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్‌ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా నిరసన తెలిపేందుకు రాజ్యాంగం హక్కు కనిపించిందని, కార్మిక, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. జిఒను రద్దు చేయకపోతే కార్మిక సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్‌, బాలాజీ, సురేష్‌, ప్రసాద్‌, ఓబయ్య, తిరుపాలు, సాలమ్మ, లక్ష్మీదేవి, పి.వెంకటరమణ పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌: అఖిల భారత సిఐటియు మహాసభలు బెంగుళూరులో ఈనెల 18 నుండి 22 వరకు జరుగుతున్న సందర్భంగా మదనపల్లె సిఐటియు కార్యాలయం ఎదురుగా మంగళవారం సిఐటియు జెండాను సీనియర్‌ నాయకులు డిఆర్‌.మధురవాణి ఆవిష్కరించారు. అనంతరం చీకటి, నల్ల చట్టాల జిఒ-1ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మికవర్గ విముక్తి కోసం పోరాడింది ఎర్ర జెండానే అని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం కార్మికులకు ఉన్న నిరసన తెలియజేయడం, ఊరేగింపులు జరపడం, బహిరంగ సమావేశాలు పెట్టుకోవడం అనే హక్కులను జిఒ-1 ద్వారా కాలరాసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పి.రాజేశ్వరి, డి.ప్రభాకర్‌రెడ్డి, మండల కార్యదర్శి జి.గంగాదేవి, నాయకులు కె.సురేంద్ర, పి.నాగరాజు, రమణ, సులోచన, రమణమ్మ, రెడ్డికుమారి, భాగ్యమ్మ, రెడ్డికుమారి, హుజూరబాను పాల్గొన్నారు. చిట్వేలి: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు యదురూరి సుజాత, కొత్తనాని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పందికాళ్ళ మణి, కెవిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఓబిలి పెంచలయ్య, అంగనవాడి వర్కర్స్‌ డి.నాగరత్న, డి.రమణకుమారి, పి.లక్ష్మీ కుమారి, సి.శాంతమ్మ, ఆటో యూనియన్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. గాలివీడు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌ దైవాదీనంకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఓబులమ్మ, మండల అధ్యక్షులు లక్ష్మీదేవి, విఆర్‌ఎల సంఘం జిల్లా నాయకులు భోగేశ్వరయ్య ఇరగమ్మ, నారాయణ, వెంకటేష,్‌ విజరు, చిట్టి, వీఆర్‌ఏలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, పలువురు పాల్గొన్నారు. రైల్వేకోడూరు రూరల్‌: స్థానిక టోల్‌గేట్‌ వద్దనున్న గాంధీ విగ్రహం ఎదుట ఉద్యోగులు, కార్మికులు చీకటి జిఒను రద్దు చేయాలని నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చంద్రశేఖర్‌, మండల అధ్యక్షులు పుల్లయ్య, ఉపాధ్యక్షులు లింగాల యానాదయ్య, కోశాధికారి, కరతోటి హరి నారాయణ, అంగనవాడీ యూనియన్‌ ప్రాజెక్టు కోశాధికారి పద్మావతి, మండల అధ్యక్షులు నిర్మల, ప్రధాన కార్యదర్శి శిరీష, లీలావతి, మైథిలి,వెన్నెల, ఈశ్వరమ్మ, శోభ, మునీంద్ర, జయ కుమారి, విద్యుత్తు కార్మిక నాయకులు అంకయ్య, శంకరయ్య, సుబ్బరాయుడు, వీఆర్‌ఏ సంఘ నాయకులు లక్ష్మీకర్‌, కుమార్‌, ఆటో యూనియన్‌ నాయకులు, సుబ్బరాయుడు, సుబ్బరామయ్య, ఏపీఎండిసి నాయకులు నరేష్‌, త్రివేణి నాయకులు, శివశంకర్‌, శ్రీనివాసులురెడ్డి, శివయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు బొజ్జ శివయ్య పాల్గొన్నారు.