ప్రజాశక్తి - కదిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా అక్రమంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ప్రతులను భోగిమంటల్లో వేసి కాల్చాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జికందికుంట వెంకటప్రసాద్ టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కందికుంట మాట్లాడుతూ ఈనెల 18న టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఆర్య వైశ్యుల కళ్యాణ మంటపం లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళుతుండడంతో అది చూసి ఓర్చుకోలేని వైసిపి ప్రభుత్వం చీకటి జీవోను విడుదల చేసి ఎమర్జెన్సీ పాలనను కొనసాగిస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, తనకల్లు మాజీ మండల కన్వీనర్ శంకర్, నాయకులు నాగేంద్రప్రసాద్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు










