చెత్త సంపద కేంద్రానికి గుర్తింపు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : మోడల్ ట్రైనింగు సెంటర్‌గా కరటంపాడు చెత్త సంపద కేంద్రంగా జిల్లా అధికారులు గుర్తించారని ఎంపిడిఒ సి.శ్రీనివాసులు తెలియజేశారు. శుక్రవారం మండల అధ్యక్షులు కేత వేణుగోపాలరెడ్డితో కలిసి ఆయన కరటంపాడు చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.2లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన నాడప్ తొట్టెలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ షెడ్‌ను మరింత పచ్చ ధనంతో ఆహ్లాదకరంగా రూపొందించాలని ఆయన పంచాయతీ కార్యదర్శి అంకయ్యకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిటిసి షేక్ ఖాసింషా, అరవీడు సర్పంచ్ సురం ప్రసాద్, చిరువెల్ల సర్పంచ్ బోలిగర్ల వెంకటేశ్వర్లు, జెడ్‌పిటిసి పెమ్మసాని శ్రీనివాసులు నాయుడు, వైసిపి నాయకులు రాజేంద్ర, ఆరవీడు కార్యదర్శి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.










