శ్రీ కూతురు మృతి, తల్లి పరిస్థితి విషమం
గుడివాడ : చెపల చెరువులో పడిన తన కూతురును రక్షించేందుకు తల్లి ప్రయత్నించగా చెరువు లోతుగా ఉండడంతో తల్లి, కూతుర్లు మునిగిన సంఘటన సోమ వారం చోటు చేసుకుంది. ఈఘటనలో కూతురు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివారంల ప్రకరం నందివాడ మండలంలోని కూచిపూడి జీవనబాబుకు చెందిన చేపల చెరువుపై గోడే రమేష్ సుమారు 2 నెలల నుండి చెరువు గట్టు మీద ఉన్న రేకుల షెడ్‌లో కుటుంబంతో జీవనం సాగిస్తునట్లు తెలిపారు. సోమవారం రమేష్ వికలాంగుల పెన్షన్, రేషన్ బియ్యం తీసుకునేందుకు కోనికి గ్రామం వెళ్ళి వచ్చాడు. చెరువు గట్టు చివర నీటిలో తన భార్య వేలంగిణీ, తన కుమార్తె హర్షిత తేలియాడుతుండగా వెంటనే చెరువులోకి దూకి ఇద్దరినీ చెరువుగట్టు మీదకు తీసుకొచ్చాడు. భార్యను పొట్ట మీద నొక్కగా కొద్దిసేపటికి స్పహలోకి వచ్చింది. కుమార్తె చెరువుగట్టు మీద ఆడుకుంటూ కాలుజారి చెరువులో పడిపోగా కూతురు హర్షిత రక్షించడానికి తల్లి కూడా చెరువులో దూకినట్లు లోతుగా ఉండటం వలన వేలంగిణికి కూడా మునిగిపోయినట్లు తెలిపారు. ఇద్దరిని గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా డాక్టర్ పరీక్షించి పాప చనిపోయినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










