Oct 24,2023 22:42

చెకుముకి సైన్స్‌ సంబరాల గోడపత్రిక ఆవిష్కరణ

చెకుముకి సైన్స్‌ సంబరాల గోడపత్రిక ఆవిష్కరణ
ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సైన్స్‌ సంబరాల గోడ పత్రికను వేమన విజ్ఞాన కేంద్రం ఆఫీస్‌ లో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్‌ రాహుల్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప, వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి నాగార్జున, జెవివి బిర్లా నాయుడు ,రఫీ, శివ, అక్బర్‌, అశోక్‌ లు గోడపత్రికను ఆవిష్కరించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్‌ వారి సహకారంతో జన విజ్ఞాన వేదిక ఈ సంబరాలను నిర్వహిస్తున్నదని తెలియజేశారు. ఈ సైన్స్‌ సంబరాల్లో అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు ఉన్నత పాఠశాలలలో 8,9,10 వ తరగతులు చదువుతున్న విద్యార్థులు పాల్గొంటారని తెలియజేశారు. పాఠశాల స్థాయి పరీక్ష నవంబర్‌ 10న, మండల స్థాయిలో నవంబర్‌ 30న, జిల్లా స్థాయిలో డిసెంబర్‌ 17న రాష్ట్రస్థాయి జనవరి 27,28 తేదీలలో జరుగుతుందని తెలియజేశారు. సైన్స్‌ ప్రయోగాలు , వేమన పద్యాలు, మ్యాజిక్‌ లాంటీ రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. వీటిలో విజేతలు గా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఒక టీం, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ఒక టీం ప్రకటిస్తారు.