Sep 08,2022 22:36

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: ఆధునిక హంగులతో సరికొత్తగా చేతక్‌ ప్రీమియం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ గురువారం ఆవిష్కరించారు. వరుణ్‌ బజాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఫ్యామిలీ స్కూటర్‌గా ప్రసిద్ది చెందిన బజాజ్‌ వారి చేతక్‌ స్కూటర్‌ ఇపుడు సరికొత్తగా తీసుకువచ్చారని తెలిపారు. ఈస్కూటర్‌తో బజాజ్‌, ఎలక్ట్రిక్‌ రంగంలో ప్రవేశించిందన్నారు. బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు వినియోగదారుల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తుందని తెలిపారు. ఒకసారి పూర్తిగా ఛార్జి చేస్తే 90 కిలోమీటర్లు ప్రయాణం చేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూబి సేల్స్‌ జడ్‌ఎం గోపాల శ్రీవాస్తవ, చేతక్‌ షోరూమ్‌ పాల్గొన్నారు.