ప్రజాశక్తి-వన్‌టౌన్: 53వ డివిజన్‌లోని హనుమంతరాయ చేపల మార్కెట్‌లో జరుగుతున్న మరమ్మతు పనులను గురువారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ మహాదేవు అప్పాజీతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ టిడిపి హయాంలో హనుమంతారాయ చేపల మార్కెట్ భవనాలు నాసిరకంగా నిర్మించారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక భవనం మరమ్మతుల పనులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఒక బ్లాక్ బిల్డింగ్ పనులు పూర్తి కావచ్చాయనీ, రెండో బ్లాక్ బిల్డింగ్ పనులు రూ.19 లక్షల ఖర్చుతో జరుగుతున్నాయన్నారు.










