Jun 12,2023 22:17

కరపత్రాలను విడుదల చేస్తున్న చేనేత కార్మికసంఘాలనాయకులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని అమలుచేయడంలో పాలకులు విఫలం చెందారని ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాం జినేయులు, చేనేత కార్మికసంఘం తాలూకాకార్యదర్శి వెంకటనారాయణలు పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ఈనెల 19న కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాకు సంబధించిన కరపత్రాలను సోమవారం వారు విడుదల చేశారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగం తరువాత అన్ని వర్గాల ప్రజలు చేనేత వత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. అలాంటి పరిశ్రమ నేడు తీవ్ర సం క్షోభంలోకి కూరుకుపోతుంటే ఎమ్మెల్యే, ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పరిశ్రమ నేడు వుందని దీంతో చేనేత కార్మికుడు భవన నిర్మాణకార్మికుడిగా, ఆటో డ్రైవర్గా మారు తున్నారన్నారు. చేనేత పరిరక్షణకు పాటుపడాల్సిన కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారన్నారు. రిజర్వేషన్‌ చట్టం గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌, హ్యాండ్లూమ్‌ అధికారులు, కలెక్టర్‌ మాట్లాడలేకపోతున్నారన్నారు. చేనేత కార్మికులకు ముద్రపథకం కింద రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికులకు ఇళ్లు కట్టించాలని, బడ్జెట్లో రూ.వెయ్యికోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికసంఘం తాలూకా అధ్యక్షుడు వెంకటస్వామి, జాతీయ చేనేత ఐక్యవేదికసంఘం జిల్లా వర్కింగ్‌ ప్రసిడెంట్‌ చట్టా రవివర్తన్‌, నాయకులు క్రిష్ణమూర్తి, భుజంగ ఈశ్వర, ఖాదర్‌ బాషా, వెంకటరమణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.