స్థానికుడితో కరచాలనం చేస్తున్న చిలకం
ధర్మవరం టౌన్ : చేనేత పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని నేసేపేటలో మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు, చేనేతల సమస్యలను అడిగితెలుసుకున్నారు. చేనేతలకు పూర్వవైభవం రావాలంటే వైసీపీని గద్దెదించాలన్నారు.










