సోమందేపల్లి : చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఎపి చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజినేయులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో చేనేత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు, ఏపీ చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి రాజగోపాల్ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఎస్ చాంద్‌బాషా, ఉపాధ్యక్షులుగా ఎం గోవిందప్ప,కమిటీ సభ్యులుగా ఓబులేసు, రామాంజనేయులు, గంగరాజు, శీనా నాయక్, మాజీ వార్డ్ మెంబర్ వెంకటేష్, నాగరాజు, సతీష్‌ను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా చేనేత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం చేనేతలను ఆదుకోవాలన్నారు. 50 సంవత్సరాలకే పింఛన్ అందిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. చేనేతకు జీఎస్టీని పూర్తిగా మినహాయించి చేనేతను ఆదుకోవాలని చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు నాగమణి, బి ప్రమీల, జి ప్రభాకర్, పోతులయ్య,, ఎస్ శ్రీరాములు, పి, ప్రకాష్ పార్టీ సభ్యులు, శ్రీకాంత్, మాబు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.










