May 22,2023 22:02

ఆర్డీవో కార్యాలయంలో సమావేశమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : ధర్మవరంలో చేనేత కార్మికులందరికి తప్పనిసరిగా మగ్గంపని కల్పిస్తామని ఎన్‌ఫోర్స్‌్‌మెంట్‌ రీజనల్‌ డిప్యూటి డైరెక్టర్‌ రాజారావు తెలిపారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన సమావేశాన్ని ఏర్పాటుచేసి పలు విషయాలను ఆర్డీవో తిప్పేనాయక్‌కు తెలిపారు. పట్టణంలో ఏ ఒక్క చేనేత కార్మికుడు కూడా పనిలేదన్న ఫిర్యాదు ఇవ్వకుండా వారి జీవనోపాధికి కృషిచేయాలన్నారు. చేనేత కార్మికుల జీవన పరిస్థితి కొంతకష్టతరంగా ఉన్నది వాస్తవమేనని, వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి చేనేతకార్మికునికి పని కల్పించేవిధంగా చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలను పట్టణంలోని ఏడీలకు ఆదేశాలిచ్చామన్నారు. పవర్‌లూమ్స్‌పై ఇప్పటివరకు దాడులు జరుగుతున్నాయని, చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మహేశ్వరరెడ్డిరెడ్డి ఎడిఒ శీనానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.