ప్రజాశక్తి-విజయవాడఅర్బన్
చేనేత కార్మికులు మగ్గం మీద తయారు చేసిన ధర్మవరం, మదనపల్లి, వెంకటగిరి, మంగళగిరి వస్త్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తూర్పు నియోజకవర్గం వైఎస్‌ఆర్సిపి ఇన్చార్జి దేవినేని అవినాష్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చేనేత చీరలకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఆటోనగర్ బస్ టెర్మినల్ ఎదురు గా ఉన్న సాయిబాబా కళ్యాణ మండపం పక్కన ఏర్పాటుచేసిన చేనేత , హస్తకళల ప్రదర్శన అమ్మకాలను దేవినేని అవినాష్ ప్రారంభించారు. వస్త్ర ప్రదర్శన నిర్వహకురాలు శాంతి మాట్లాడుతూ చేనేత వస్త్ర ప్రదర్శన 14 వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 అందు బాటులో ఉంటుందన్నారు.










